NTV Telugu Site icon

Renu Desai: “ఆ పిచ్చి ఫ్యాన్స్ నోళ్లు మూయించు.. పవన్”

Pawan

Pawan

Renu Desai: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాల్లో పవన్ ఎదుర్కుంటున్న విమర్శలు అన్ని ఇన్నికావు . మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని, ప్యాకేజ్ స్టార్ అని.. ఏవేవో విమర్శలు చేస్తూనే ఉన్నారు. వాటికి తనదైన రీతిలో పవన్ సమాధానమిస్తూనే ఉన్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. గత వారం నుంచి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టే పోస్టులు నెట్టింట వైరల్ గా మారడమే కాదు రాజకీయాల్లో సైతం కలకలం రేపుతున్నాయి. అకీరా పుట్టినరోజున పవన్ ఫ్యాన్ ఒకతను మొదలుపెట్టిన రచ్చ .. ఇంకా రగులుతూనే ఉంది. అకీరాను మా అన్న కొడుకు.. మా అన్న కొడుకు అని ఫ్యాన్స్ అంటూ ఉండడంతో తట్టుకోలేని రేణు బరస్ట్ అయ్యింది. ” నీ అన్న కొడుకు..? అకీరా నా కొడుకు.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడితో ఆగలేదు. తాను 11 ఏళ్లు పవన్ ఫ్యాన్స్ వలన నరకం అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Virupaksha Trailer: రుద్రవనాన్ని కాపాడే విరూపాక్ష వచ్చేశాడు

ఇక అప్పుడెప్పుడో రెండో పెళ్లి చేసుకోవాలని రేణు ప్రయత్నించింది.. అప్పుడు కూడా ఇలాగే వదినా వదినా అంటూ ఆమెకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి, ఆ పెళ్లి చేసుకొంటే చంపేస్తామని బెదిరించేవరకు తెచ్చారు. ఇక దీంతో రేణు ఆ నిర్ణయాన్ని విరమించుకొంది. విడాకులు తీసుకొని విడిపోయాక ఇంకా వదినా.. వదినా అంటూ ఆమె వెనుక పడడం, ఆమె వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం పద్దతి కాదు అని ఆమెకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఆ సపోర్ట్ చేసిన వారందరి పోస్టులను సోషల్ మీడియాలో పెడుతూ రేణు తనదైన రీతిలో స్పందిస్తుంది.

Renu Desai: మీరు ఒక తల్లికి పుట్టలేదా.. అకీరా నా కొడుకు.. పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్

తాజాగా ఒక వ్యక్తి రేణుకు సపోర్ట్ చేస్తూ.. “పవన్ కళ్యాణ్ తో మీరు విడిపోయి ఎన్నో ఏళ్లు అవుతుంది. ఇంకా ఈ జనాలు చెత్త వాగుడు వాగడం మాత్రం మానలేదు. అయినా వారి మాటలు భరిస్తూ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంకా ఇంకా పవన్ ఫ్యాన్స్ మిమ్మల్ని హార్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా.. మిమ్మల్ని వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్న ఈ పిచ్చి ఫ్యాన్స్ నోరు పవన్ ఎందుకు మూయించడం లేదు. ఒక్క స్టేట్మెంట్ పాస్ చేస్తే.. అందరు పవన్ మాట వింటారు. రాష్ట్రప్రజలందరి బాధను పట్టించుకొంటూ.. సమాజంలో ఆడవారికి గౌరవాన్ని ఇవ్వాలి అని తిరుగుతున్నా పవన్ .. తన మాజీ భార్య గౌరవాన్ని ఎందుకు కాపాడడం లేదు. ఒకప్పుడు తనను ఎంతో ప్రేమించిన అమ్మాయి.. ఇంత మానసిక సంఘర్షణకు గురవుతుంటే చూస్తూ ఉండే పవన్.. ఇంకా రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడతాడు..? ” అంటూ రాసుకొచ్చాడు. ఇక దీనికి రేణు స్పందిస్తూ.. “నా దగ్గర సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో నా దగ్గరకు వస్తున్నాయి. నా కంట్రోల్లో లేని విషయాల గురించి నేను వారికి ఏం చెప్పాలి” అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరిఈ విషయమై పవన్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Show comments