Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ముద్దుల కుమారుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. రేణు .. పవన్ నుంచి విడిపోయినా కూడా కొడుకును మాత్రం మెగా కుటుంబంలో ఒకడిగానే పెంచుతుంది. అకీరా కూడా మెగా బ్రదర్స్ తో నిత్యం టచ్ లో ఉంటూనే ఉంటాడు. ఇక పవన్ సైతం కొడుకుకు ఏ లోటు రాకుండా పెంచుతున్నాడు. మెగా కుటుంబం నుంచి ఇప్పటికే రెండు తరాలు ఇండస్ట్రీలో అడుగుపెట్టాయి. ఇప్పుడు మూడో తరం రెడీ అవుతుంది. అందులో అకీరా మీదనే అందరి కళ్లు ఉన్నాయి. అయితే అకీరా మనసు మాత్రం యాక్టింగ్ మీద లేదని రేణు ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకుంటున్న అకీరా.. ప్రస్తుతం చదువు మీద దృష్టి పెట్టాడని రేణు తెలిపింది. అయితే తాజాగా అకీరా.. అమెరికాలోని యాక్టింగ్ స్కూల్ లో చేరినట్లు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అధికారికంగా చెప్పుకొచ్చిన సంగతి తెల్సిందే. దీంతో అకీరా త్వరలోనే హీరో అవుతాడు అని.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
Parakramam: మాంగల్యం డైరెక్టర్ ‘పరాక్రమం’తో వచ్చేస్తున్నాడు!
ఇక ఆ ఆనందాన్ని రేణు ఎంతోసేపు ఉంచలేదు. అకీరా టాలీవుడ్ ఎంట్రీ అంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేసింది. అకీరాకు హీరో అవ్వాలని లేదని ఖరాకండీగా చెప్పుకొచ్చింది. ” గయ్స్.. ఇప్పటివరకు అయితే అకీరాకు హీరో అవ్వాలనే కోరిక లేదు.. భవిష్యత్ లో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. దయచేసి.. నేను ఇన్స్టాగ్రామ్ లో ఏ పోస్ట్ పెట్టినా దాని గురించి మీరేదో అనుకోని ఏది పడితే అది రాయకండి. ఒకవేళ అకీరాకు హీరో అవ్వాలని ఉంది అని చెప్పిన వెంటనే.. నేనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను” అని చెప్పుకొచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందుతున్నారు. మరి అకీరా ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.