Renu Desai Daughter Aadya Comments on Tiger Nageswar Rao Trailer: టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో నటించి చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్న క్రమంలో సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఆమె షేర్ చేసుకున్నారు. అయితే హేమలతా లవణం గారి పాత్ర మీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది ? అని అడిగితే చాలా మార్పు తెచ్చిందని, సామాజికంగా ఇప్పటివరకు చేసింది సరిపోదనిపించిందని ఆమె అన్నారు. ఇంకా పని చేయాలనిపించింది, చిన్న పిల్లలు ఎవరూ ఆకలితో వుండకూదనేది నా లక్ష్యం, ఎంతవరకు కుదిరితే అంత ఆ దిశగా పని చేయాలని ఆమె అన్నారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా విషయంలో ఇప్పటివరకూ మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అని అడిగితే ట్రైలర్ చూసిన మా అమ్మాయి వయసుకు తగ్గ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉందమ్మా’ అని చెప్పింది, ఇది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని అన్నారు.
నిజానికి ఆమె నా పాత్ర చూసి ఆ తెల్లబట్టలు ఏంటి ఆ వాలకం ఏంటి అని అడుగుతుంది అనుకున్నా, కానీ ఆమె అలా గర్వంగా ఉందని అనడంతో ఫర్లేదు మరిన్ని సినిమాలు చేయచ్చనే ధైర్యం వచ్చిందని అన్నారు. ఇక నటనకి చాలా విరామం ఇచ్చారు కదా ? ఇక ఇప్పుడు నటన కంటిన్యు చేస్తారా అని అడిగితే నాకు నటించేలానే వుంది కానీ కథ, పాత్ర, దర్శకుడు, నిర్మాత ఇవన్నీ కలిసి రావాలని అన్నారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వర రావుకి ఈ మూడు కలిసొచ్చాయని, మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు. నాకు నటన ఎప్పుడూ కొనసాగించాలనే ఉంటుంది, నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా అని అన్నారు.