Renu Desai: టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఇందులో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటించి మెప్పించింది. ఆమె పాత్ర కొద్దిసేపే ఉన్నా కూడా ఆమె కనిపించగానే థియేటర్ లో అభిమానులు కేకలు, అరుపులతో దద్దరిల్లిపోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రేణు యాక్టివ్ గా కనిపిస్తుంది. ఇక వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ.. సినిమా విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. పవన్ తో పెళ్లి అయ్యిన దగ్గర నుంచి ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు. దాదాపు 23 ఏళ్ళు తరువాత ఆమె టైగర్ నాగేశ్వరరావు తో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కన్నా ముందే రేణు కు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లో అవకాశం వచ్చిందట. అయితే ఆ పాత్రను రేణు అంగీకరికరించలేదట. ఈ విషయాన్నీ ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Karnataka: ఇంట్లో గొడవలు.. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
” నాకు సర్కారు వారి పాటలో అవకాశం వచ్చింది. బ్యాంక్ ఆఫీసర్ నదియా పాత్రకు ముందు నన్ను అడిగారు. నేను కూడా ఓకే చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఎందుకు సెట్ కాలేదో అనే కారణాలను మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు చెప్పడం వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. నిజం ఏమిటో చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది.. కానీ మళ్లీ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కామ్‌గా ఉండటమే బెటర్ అని చెప్పడం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.