మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు మోహన్ బాబు.ఈ కేసు పై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అలాగే నాలుగు వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు నేడు ఈ కేసులో తాజాగా తీర్పును వెలువడించింది.
Also Read : RamCharan : రామ్ చరణ్ – బాలీవుడ్ – మైథలాజికల్ ..?
ఈ కేసులో మంచు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ కేసు విచారణ జరపిన జస్టిస్ సుదాంశ్ దులియా ధర్మాసనం సిసి ఫుటేజ్ ఎందుకు తొలగించారు, మీ కొడుకు పై ఎందుకు ఫిర్యాదు చేశారు, అసలు జర్నలిస్టుపై ఎందుకు దాడి చేశారు, అతడిని ఎందుకు బెదిరించారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అందుకు సమాధానంగా ‘జర్నలిస్టుపై కావాలని దాడి చేయలేదు, అతడికి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను, పోలీసుల విచారణకు సహకరిస్తాను, పద్మశ్రీ అవార్డు గ్రహీతను, యూనివర్సిటీ రన్ చేస్తున్నాను, గతంలో ఎంపీగా ఉన్నాను,కుటుంబంలో సమస్యల వల్ల, తన కొడుకుపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాం అని బదులిచ్చారు. అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువడించింది సుప్రీం కోర్టు.