Site icon NTV Telugu

Tillu Square: పాపం… ఏ డేట్ అనౌన్స్ చేసినా వాళ్లు వదలడం లేదుగా!

Tillu 2 Postponed

Tillu 2 Postponed

Release Date tension for tillu square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకి అప్పట్లోనే సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడమే కాదు సిద్దు జొన్నలగడ్డకి మంచి యూత్ ఫాలోయింగ్ కూడా తెచ్చి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అయితే మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా రెండో భాగంలో మాత్రం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ముందు ఆగస్టు 11వ తేదీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Salaar: ‘సలార్’ టీజర్‏లో ఇంట్రెడక్షన్ ఇచ్చిన నటుడు ఎవరో తెలుసా?

అయితే అదే రోజు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా, రజినీకాంత్ జైలర్ సినిమాతో పాటు యానిమల్ సినిమాలు కూడా డేట్ లాక్ చేసుకున్నాయి. అయితే వీటిలో యానిమల్ సినిమా వాయిదా పడి డిసెంబర్ నెలకు వెళ్ళింది కానీ భోళా శంకర్, జైలర్ సినిమాలకు మాత్రం అలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టిల్లు స్క్వేర్ సినిమాని సెప్టెంబర్ 15వ తేదీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ 15వ తేదీ కూడా బోయపాటి రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమాలతో పాటు విశాల్ హీరోగా ఎస్ జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మార్క్ ఆంటోనీ సినిమా కూడా డేట్ లాక్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి టిల్లు స్క్వేర్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయనేది వేచి చూడాల్సి ఉంది.

Exit mobile version