Site icon NTV Telugu

Rekha Vedavyas: గుర్తుపట్టలేకుండా.. అతి దారుణంగా మారిపోయిన తారకరత్న హీరోయిన్..

Rekha

Rekha

Rekha Vedavyas: నెమలి కన్నోడా.. నమిలే చూపోడా అంటూ ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో తారకరత్న అందాన్ని పొగిడిన ముద్దుగుమ్మ గుర్తుందా..?.. పోనీ ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూశారా అంటూ ఆనందం సినిమాలో ఆకాష్.. తన ఫ్రెండ్ తో ప్రేమలో పడిన భావాలను చెప్తూ ఉంటాడు.. ఆ ఫ్రెండ్ గుర్తుందా.. ? హా.. ఆమెనే రేఖ వేదవ్యాస్. మొదటి సినిమా ఆనందం సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోని కుర్రకారు గుండెల్లో రేఖ తనదైన ముద్ర వేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు అందుకోవడమే కాకుండా మంచి హిట్లు కూడా అందుకుంది. జానకి వెడ్స్ శ్రీరామ్, దొంగోడు లాంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇక తెలుగులో కాకుండా కన్నడలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఓకే వెలుగు వెలిగింది. ఇక 2014 తరువాత రేఖ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అప్పుడప్పుడు షోస్ లో మెరవడమే కానీ, సినిమాలు చేసిన దాఖలాలు అయితే లేవు.

Vishal: ఆ డైరెక్టర్ పెట్టిన ఇబ్బందులు.. వేరే హీరో అయితే గుండెపోటుతో చచ్చేవాడు

ఇక ఎంతో అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత బొద్దుగా మారి కనిపించింది. ఇక తాజాగా రేఖ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. దారుణంగా అస్తిపంజరంలా మారిపోయింది. అందుకు కారణం ఆమె అనారోగ్య సమస్యలు అని తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత ఆమె ఈటీవీ లో ప్రసారం అవుతున్న శ్రీదేవిడ్రామా కంపెనీకి గెస్ట్ గా వచ్చింది. సడెన్ గా ఆమెను చూసి అక్కడఉన్నవారే కాదు.. ఆమె అభిమానులు కూడా షాక్ అయ్యారు. బక్కచిక్కిపోయి.. ముఖం మొత్తం కళతప్పి కనిపించింది. అసలు ఆమెకు ఏమైందో అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే తనకేం అయ్యిందో రేఖ స్టేజిమీద చెప్పుకొచ్చింది ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఆమెకు ఏమైందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Exit mobile version