Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపై పడింది. ఇటీవలే ఆహా ఓటిటీలో అన్యాస్ ట్యుటోరియల్ తో వచ్చి భయపెట్టిన ఆమె తాజాగా శాకినీ డాకినీ చిత్రంతో నవ్వించడానికి రెడీ అయిపోయింది. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కొరియన్ డ్రామా మిడ్ నైట్ రన్నర్స్ కు ఈ సినిమా అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేసిన చిత్ర బృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా మారింది. ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ రెజీనా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గత కొన్ని రోజులుగా రెజీనా పెళ్లి వార్తలపై అనేక రూమర్స్ వస్తున్న విషయం తెల్సిందే.
ఆమె సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నదని, త్వరలోనే వివాహం జరగబోతుందని చెప్పుకొచ్చారు. ఈ వార్తలపై రెజీనా స్పందించింది. ” పెళ్లి వార్తలు అన్నీ అబద్దం. నేను గతంలో ఒకరిని ప్రేమించి మోసపోయాను. మా ఇద్దరి మధ్య విబేధాల వలన మేము 2020 లో విడిపోయాం. ఆ తర్వాత ఆ బాధ నుంచి నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉంటున్నాను. ప్రేమ, పెళ్లి గురించి నేను మాట్లాడదలచుకోలేదు. ఒకరు తోడు లేకుండా బతకడం ఎలాగో మా అమ్మ నాకు చిన్నతనం నుంచే నేర్పింది. ముందు ముందు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా చెప్పలేను” అని చెప్పుకొచ్చింది. దీంతో రెజీనా అభిమానులు అసహనంవేయటం చేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ త్వరలో తన మనసును మార్చుకుంటుందేమో చూడాలి.
