Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర,నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం శాకినీ డాకినీ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఈ సినిమా గురించి బజ్ పెంచడానికి ఏమి లేదు. ఇద్దరు హీరోయిన్ల మల్టీస్టారర్.. కొరియన్ డ్రామా రీమేక్.. కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ డైరెక్టర్.. మంచి నిర్మాతలు ఇంతే. ఇది పబ్లిసిటీ కి సరిపోదు అనుకున్నదో ఏమో రెజీనా తన బోల్డ్ వ్యాఖ్యలతో సినిమాపై బజ్ తేవడానికి ప్రయత్నిస్తోంది. మొన్నటికి మొన్న ట్రైలర్ ఈవెంట్ లో అమ్మాయిలను ఎలాంటి ప్రశ్నలు వేయాలో తెలియదా ..? అంటూ రిపోర్టర్ పై సీరియస్ అవ్వడంతో మొదలుపెట్టిన ముద్దుగుమ్మ వరుసగా అడల్ట్ కంటెంట్ మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది.
ఒక ఇంటర్వ్యూలో అబ్బాయిలు.. మ్యాగీ ఒక్కటే.. 2 మినిట్స్ లో అయిపోతుందని చెప్పి షాక్ ఇచ్చిన రెజీనా తాజాగా ఒక అమ్మాయితో లిప్ కిస్ చేశానని చెప్పి హీట్ పెంచింది. ఒక ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ “ఒకసారి ఒక మహిళా నా దగ్గరకు వచ్చి నా పెదాలను ముద్దాడింది. నేను ఆ సడెన్ సంఘటనకు షా అయ్యాను. అదే ప్లేస్ లో అబ్బాయి ఉంటే చెంప పగలగొట్టేదాన్ని.. కానీ, అమ్మాయి కాబట్టి వెనక్కి నెట్టలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ప్రమోషన్స్ కోసం కోసం రెజీనా ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తుందని మరికొందరు అంటున్నారు. మరీ అమ్మడి మాటల ఎఫెక్ట్ రేపు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
