Big Breaking: తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాతలకు సహకరించని కారణంగా ఆ నలుగురు హీరోలను కోలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ హీరోలు ఎవరో కాదు.. ధనుష్, అధర్వ, శింబు, విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న ఈ హీరోలు.. నిర్మాతలకు సహకరించకుండా ఉండడం వలన.. వారికి నష్టం వాటిల్లడానికి కారణం అయిన కారణంగా.. వారికి రెడ్ కార్డ్ జారీ చేసి.. ఇకనుంచి ఏ తమిళ్ సినిమాలో కూడా వారు నటించకుండా చేయనున్నట్టు వారు తెలిపారు. ఇక ఈ హీరోలు నిషేధానికి కారణాలు ఇలా ఉన్నాయి.
హీరో ధనుష్.. తెనందాల్ నిర్మాణ సంస్థలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. దాదాపు 80% షూటింగ్ పూర్తయ్యింది. మరో 20% షూటింగ్ పూర్తిచేయకుండా నిర్మాతను తిప్పుకొని చివరికి సినిమా చేయను అని చెప్పడంతో అతడికి ఎంతో నష్టం వాటిల్లింది. ఇక సదురు నిర్మాత తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడంతో ధనుష్ కు రెడ్ కార్డ్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇక హీరో శింబు వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది నిర్మాతలతో ఆయనకు వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాల గురించి ఇప్పటికే ఎన్నోసార్లు సంప్రదించినా ఎలాంటి మార్పు రాకపోవడంతో శింబుకు రెడ్ కార్డ్ జారీ చేసినట్లు సమాచారం.
ఇక విశాల్.. ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఆయనకు రెడ్ కార్డ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అధర్వ సైతం నిర్మాతలకు సహకరించని కారణంగా రెడ్ కార్డ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరే కాకుండాఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు ఉన్నట్లు రెడ్ కార్డ్ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ వార్తతో కోలీవుడ్ లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. స్టార్ హీరోలను బ్యాన్ చేస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.