Site icon NTV Telugu

RRR : రికార్డు బ్రేకింగ్ ప్రీ సేల్స్… యూఎస్ లో నందమూరి ఫ్యాన్స్ రచ్చ

rrr

RRR దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ ఎట్టకేలకు మార్చి 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ ప్రీ సేల్స్ తో దూసుకెళ్తోంది. అక్కడ తాజాగా ప్రీ-సేల్స్ $3 మిలియన్ల మార్క్‌ను దాటాయి. ఈ చిత్రం ప్రీమియర్ షోల కోసం అదనంగా $2M, వారాంతంలో $1Mని కూడా సంపాదించింది.

Read Also : Bigg Boss Non Stop : మూడవ వారం ఎలిమినేషన్… ఆర్జే అవుట్

ఇక మరోవైపు RRR ప్రమోషనల్ క్యాంపెయిన్‌తో USAలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దూకుడు పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక బహిరంగ ప్రదేశాలలో బిల్ బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇప్పుడు టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఎన్టీఆర్ అభిమానులు RRR నుండి జూనియర్ ఎన్టీఆర్ ఉన్న బిల్‌బోర్డ్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ బిల్‌బోర్డ్ వచ్చే వారం రోజుల పాటు అక్కడ ప్రదర్శితం అవుతుంది. “మా @tarak9999ని తిరిగి థియేటర్లలోకి గ్రాండ్‌గా స్వాగతిస్తున్నాను. Frisco TX (USA)లో వచ్చే వారం పాటు బిల్ బోర్డ్ డిస్‌ప్లే” అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రూప్ నుండి వచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ఆర్‌ఆర్‌ఆర్‌” విడుదలకు ముందే అమెరికాలోని ఎన్టీఆర్‌ అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version