Site icon NTV Telugu

Prabhas: పెద్ద నాన్న మృతి.. ప్రభాస్ ఏడుపును ఆపడం ఎవరి తరం కావడంలేదే

Rebel

Rebel

Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఒక్కసారిగా చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్దనాన్న మృతితో ప్రభాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెబల్ స్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రభాస్ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ యంగ్ రెబల్ సార్ గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కృష్ణంరాజు లేకపోయి ఉంటే ఈ ప్రభాస్ లేడని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు డార్లింగ్. తన తండ్రి చనిపోయినప్పుడు ప్రభాస్ కృష్ణంరాజును పట్టుకొని ప్రభాస్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఆ సమయంలో నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి అన్నీ తానై చూసుకున్నాడు కృష్ణంరాజు. అలాంటి పెద్ద దిక్కు నేడు మూగబోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఇక తనకున్న పెద్ద దిక్కు ఇకనుంచి ఉండరని తెలియడంతో ఒక్కసారిగా ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన ఏడుపును ఆపడం ఎవరి వలన కావడంలేదు. ఎంతమంది వచ్చి ఆయనను ఓదార్చాలని చూస్తున్నా ప్రభాస్ కంటి నుంచి కన్నీటి ధార ఆగడం లేదు. ఇక ఆ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరికి గుండె బరువెక్కక మానదు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్.. తమ ఫెవరేట్ హీరోను అలా చూసి గుండె తరుక్కుపోతుందని అంటున్నారు. మీ వెంట మేము ఉంటామన్న.. నిన్ను ఇలా చూడలేకపోతున్నామంటూ వారు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

https://twitter.com/i/status/1568897216441626627

Exit mobile version