Prabhas: పెద్ద నాన్న మృతి.. ప్రభాస్ ఏడుపును ఆపడం ఎవరి తరం కావడంలేదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఒక్కసారిగా చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్దనాన్న మృతితో ప్రభాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెబల్ స్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రభాస్ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ యంగ్ రెబల్ సార్ గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కృష్ణంరాజు లేకపోయి ఉంటే ఈ ప్రభాస్ లేడని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు డార్లింగ్. తన తండ్రి చనిపోయినప్పుడు ప్రభాస్ కృష్ణంరాజును పట్టుకొని ప్రభాస్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఆ సమయంలో నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి అన్నీ తానై చూసుకున్నాడు కృష్ణంరాజు. అలాంటి పెద్ద దిక్కు నేడు మూగబోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఇక తనకున్న పెద్ద దిక్కు ఇకనుంచి ఉండరని తెలియడంతో ఒక్కసారిగా ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన ఏడుపును ఆపడం ఎవరి వలన కావడంలేదు. ఎంతమంది వచ్చి ఆయనను ఓదార్చాలని చూస్తున్నా ప్రభాస్ కంటి నుంచి కన్నీటి ధార ఆగడం లేదు. ఇక ఆ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరికి గుండె బరువెక్కక మానదు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్.. తమ ఫెవరేట్ హీరోను అలా చూసి గుండె తరుక్కుపోతుందని అంటున్నారు. మీ వెంట మేము ఉంటామన్న.. నిన్ను ఇలా చూడలేకపోతున్నామంటూ వారు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Akkineni Nagarjuna : 29న నాగార్జున 'కింగ్ 100' క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్‌డేట్
- The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
- Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
- TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
https://twitter.com/i/status/1568897216441626627
తాజావార్తలు
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్‌డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!