Rebel: రెబల్.. ఈ టైటిల్ కేవలం ప్రభాస్ కు మాత్రమే సొంతమని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్ చేసేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు బిరుదును ప్రభాస్ కైవసం చేసుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి రెబల్ అనే టైటిల్ తో ఒక సినిమా కూడా చేశారు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ.. రెబల్ అంటే.. ప్రభాస్ అని ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసింది. ఇక ఇప్పుడు అదే టైటిల్ ను కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొట్టేశాడు. అతను ఎవరో కాదు జీవీ ప్రకాష్ కుమార్. ఒకపక్క మ్యూజిక్ డైరెక్టర్ గా.. ఇంకోపక్క హీరోగా జీవీ ప్రకాష్ బిజీగా మారాడు. అనిరుధ్ తరువాత కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే జీవీ పేరే వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో కూడా జీవీ బిజీగా మారాడు. ఇక ఇప్పుడు జీవీ మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు.
Devara: గోవాలో దేవర యాక్షన్.. ఓ రేంజ్ లో ఉండబోతున్నదంట
నికేష్ RS దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ సరసన మమితా బైజు నటిస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రివీల్ చేశారు. రెబల్ అనే టైటిల్ ను రివీల్ చేస్తూ జీవీ ప్రకాష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో జీవీ రెబల్ లానే కనిపిస్తున్నాడు. పంచె కట్టుకొని.. ముఖం నిండా గాయాలతో సీసా బాంబ్ లను విసురుతూ కనిపించాడు. వెనుక ఎర్ర జెండాలు కనిపిస్తున్నాయి. ఇదేదో స్టూడెంట్స్ గొడవల మధ్య జరిగే కథలా అనిపిస్తోంది. ఇక రెబల్ టైటిల్ తో వస్తున్నాడు కాబట్టి తెలుగులో జీవీ ఎలాంటి ఆదరణ అందుకుంటాడో చూడాలి.