డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్ విన్నర్, నాలుగో సీజన్ జడ్జి అయినా టీనా సాధు ఈరోజు (మే 12) ఉదయం గోవాలోని తన ఇంట్లోనే మృత్యువాత పడిన విషయం విదితమే! చిన్న వయసులోనే టీనా మరణించడంతో, సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమె మరణం వెనుక గల కారణాలేంటన్న విషయంపై జనాలు ఆరా తీస్తుండగా, పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
నాలుగైదు రోజుల క్రితం టీనా హైదరాబాద్‌కు వచ్చిందని, యాంకర్ శిల్పాచక్రవర్తిని కలిసి కాసేపు ఆమెతో గడిపిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాను తిరిగి మళ్ళీ డ్యాన్స్ షోలలో రీఎంట్రీ ఇవ్వాలనుందని తన మనసులోని మాటను టీనా బయటపెట్టినట్టి తెలుస్తోంది. ఆ తర్వాత తిరిగి గోవా వెళ్ళిపోయిన టీనా.. ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఎక్కువ మోతాదులో మద్యం సేవించినట్టు చెప్తున్నారు. దీంతో, ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నట్టు ఓ వార్త వైరల్‌గా మారింది. మరి, ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే!
కాగా.. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోన్న టీనా, గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకొని, అక్కడ నివసిస్తోంది. చివరిసారిగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీనా మరణానికి గల కారణాలేంటో, ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
