Site icon NTV Telugu

“అంధాధున్” ముందుగా ఈ స్టార్ హీరో… ఎలా చేజారిందంటే ?

Dulquer-Salmaan

Dulquer-Salmaan

అప్పుడప్పుడూ నటీనటులు పలు కారణాల వల్ల గుమ్మం దాకా వచ్చిన అవకాశాలను కోల్పోతారు. అయితే కొన్నిసార్లు వాళ్ళు అలా వదులుకున్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద విజయవంతమై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి. గతంలో ఇలాంటి ఉదంతాలు మనం చాలానే చూశాం. తాజాగా మరో స్టార్ హీరో కూడా ఇలాగే అవకాశాన్ని కోల్పోయాడట. జాతీయ అవార్డు ఫిల్మ్ “అంధాధున్” అవకాశం ముందుగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దగ్గరకు వచ్చిందట. ఈ విషయాన్ని దుల్కర్ స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మిస్ కమ్యూనికేషన్ వల్ల ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారట.

Read Also : “శ్యామ్ సింగ రాయ్” టీజర్ ఎప్పుడంటే ?

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన “అంధాధున్” చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించారు. ఆయుష్మాన్ ఈ చిత్రంలో తన నటనకు జాతీయ అవార్డును అందుకున్నాడు. తాజాగా దుల్కర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ చిత్రాన్ని వదులుకున్నందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. “అంధాధున్” తరువాత తెలుగు, మలయాళం వంటి ఇతర భాషలలోకి రీమేక్ అయిన విషయం తెలిసిందే. దీని తమిళ రీమేక్ వెర్షన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే దుల్కర్ ప్రస్తుతం తాజా చిత్రం “కురుప్” ఈరోజు థియేటర్లలో విడుదలవుతోంది. నిజ జీవిత గ్యాంగ్‌స్టర్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మహమ్మారి తర్వాత కేరళలో విడుదలైన మొదటి భారీ చిత్రం ‘కురుప్’. సుశిన్ శ్యామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోబిత ధూళిపాళ, టోవినో థామస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version