NTV Telugu Site icon

రాగిణి ద్వివేదితో ‘రియల్ దండుపాళ్యం’!

real dandupalyam

real dandupalyam

రాగిణి ద్వివేది, మేఘ‌న రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన చిత్రం ‘రియ‌ల్ దండుపాళ్యం’. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో సి. పుట్ట‌స్వామి ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 4న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ ట్రైలర్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”ఈ ‘రియ‌ల్ దండుపాళ్యం’లో మ‌హిళ‌లు వారిపై జ‌రిగే అకృత్యాలు, అన్యాయాల‌పై తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుందో చూపించే ప్ర‌య‌త్నం చేసార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ ట్రైల‌ర్ చూశాక ఒక క‌ర్తవ్యం, ప్ర‌తిఘ‌ట‌న‌, మౌన‌పోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్ర‌తి మ‌హిళ చూడాలి” అని అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ, ”గతంలో వచ్చిన ‘దండుపాళ్యం’ సిరీస్ తెలుగు, క‌న్న‌డ భాషల్లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వాటిని మించేలా ‘రియ‌ల్ దండుపాళ్యం’ చిత్రం ఉండ‌బోతుంద‌నిపిస్తోంది” అని అన్నారు. ‘సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’ అని నిర్మాత పుట్టస్వామి చెప్పారు.

కథానాయికగా రాగిణి ద్వివేది మాట్లాడుతూ… ”ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. డైర‌క్ట‌ర్ రియ‌ల్ ఇన్స్ డెంట్స్ బేస్ చేసుకుని ఈ సినిమాను ఎంతో రియ‌లిస్టిక్ గా తెర‌కెక్కించారు. గ‌తంలో వ‌చ్చిన సిరీస్ క‌న్నా ‘రియ‌ల్ దండుపాళ్యం’ అద్భుతంగా ఉండ‌బోతుంది” అని చెప్పారు. పదమూడేళ్ళ వయసులో ఎవ‌రెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వ‌రల్డ్ రికార్డ్ సృష్టించిన మాలోవ‌త్ పూర్ణ మాట్లాడుతూ….”పేద‌రికం దేనికి అడ్డు కాద‌నీ, ఆడ‌వారు ఎందులో త‌క్కువ‌కాద‌నీ, ఏదైనా సాధించ‌ల‌గ‌ర‌నీ నిరూపించ‌డానికే నేను ఎవ‌రెస్ట్ శిఖరాన్ని అధిరోహించాను. ఇక ఈ సినిమాలో ఆడ‌వారిపై జ‌రుగుతున్న అకృత్యాల‌ను చూపిస్తూ దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా మ‌హిళ‌లు ఎలా ఎదుర్కోవాలో చూపించారు. ఇలాంటి సందేశాత్మ‌క చిత్రాలు మరిన్ని రావాలి” అని అన్నారు.