NTV Telugu Site icon

Friday Box Office : ఈ వారం సందడి… ఎన్ని సినిమాలంటే ?

Tollywood

Tollywood

శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్ థియేటర్లలో ఎంత సందడి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి శుక్రవారం చిన్న, పెద్ద ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ, సినీ ప్రియులకు వినోదాన్ని పంచుతాయి. అయితే ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గట్టిగానే షేక్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే మెగాస్టార్స్ చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య” రిలీజ్ కు రెడీగా ఉంది. ‘ఆచార్య’తో పాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.

ఆచార్య
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బడా మూవీ “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొట్టమొదటిసారిగా మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో నటించింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా చిత్రంలో పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, సోనూసూద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

కన్మణి రాంబో ఖతీజా
విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు, నయనతార ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’. తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఒకే సారి ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేసే వ్యక్తి కథాంశంతో తెరకెక్కిన ఈ ఫన్నీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

భళా తందనాన
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘భళా తందనాన’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటించారు. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, సత్య, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.

Read Also : Nayanthara – Vignesh Shivan : ముందు పెళ్లి… ఆ తరువాతే అవన్నీ !

జన గణ మన
మలయాళ యాక్షన్ థ్రిల్లర్ “జన గణ మన”కు డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించారు. సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు, మమతా మోహన్ దాస్, శ్రీ దివ్య, పశుపతి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 28న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు రెడీగా ఉంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రన్ వే 34
అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, అమితాబ్ బచ్చన్, బోమన్ ఇరానీలతో పాటు ఆకాంక్ష సింగ్, అంగీరా ధర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం “రన్ వే 34”. ఈ చిత్రానికి స్వయంగా అజయ్ దేవగన్ దర్శకత్వం వహించడం విశేషం. ఏప్రిల్ 29న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

హీరోపంతి 2
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన “హీరోపంతి”కి సీక్వెల్ గా “హీరోపంతి-2” రూపొందుతోంది. ఈ సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. “హీరోపంతి 2” అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ కాగా, ఈ మూవీకి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి రానుంది.

ఇంకా గంగుబాయి కతియావాడి ఏప్రిల్‌ 26న, మిషన్‌ ఇంపాజిబుల్‌ ఏప్రిల్‌ 29న నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం కానున్నాయి.