NTV Telugu Site icon

RC15: రామ్ చరణ్- శంకర్ టైటిల్ భలే గమ్మత్తుగా ఉందే..?

Charan

Charan

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం RC15. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. ఈ చిత్రంలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. తండ్రి కొడుకులుగా తొలిసారి చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా టైటిల్ గురించి ఎప్పటినుంచో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. సర్కారోడు, అధికారి, సీఎం అంటూ ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి ఇంకో టైటిల్ వచ్చి చేరింది. అదే ‘సీఈఓ’. ఈ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నాడు. దీంతో ఈ టైటిల్ అందుకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. సీఈఓ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అని అర్ధం అంట. ఇక ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయమంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది భలే గమ్మత్తుగా ఉందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.

Show comments