Site icon NTV Telugu

“ఆర్సీ 15” సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే?

Rc15

Rc15

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్సీ 15”. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ స్థాయిలో రూపొందించిన సెట్ లో పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్‌ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీకరించారు. నవంబర్ 10న మొదటి షెడ్యూల్ ముగియడంతో తదుపరి షెడ్యూల్‌కి వెళ్లడానికి ముందు టీమ్ కొన్ని రోజులు విరామం తీసుకుంది. నవంబర్ 15 నుండి హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో చిత్రీకరించనున్నారు. సెకండ్ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. పవర్ ఫుల్ సోషల్ మెసేజ్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా అవినీతి నిరోధక నేపథ్యంలో ఉండబోతోంది. ఈ సోషల్ డ్రామాలో రామ్ చరణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. దర్శకుడు శంకర్ ఇంతకుముందు సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది.

Read Also : కేబీఆర్ పార్క్ లో సినీ నటిపై దాడి

Exit mobile version