RC 16 Team Welcomes Ar Rahaman on Board: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కుదరలేదు, కాబట్టి సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక అదలా ఉంచితే రామ్ చరణ్ 16వ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ వచ్చేసింది, రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ను ఆహ్వానిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
The Kerala Story : ఓటీటిలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈరోజు రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామ్‍చరణ్ 16 సినిమాకు తాను సంగీతం అందిచనున్నట్టు ఏఆర్ రహమాన్ కొన్నాళ్ళ క్రితమే తెలుగు మీడియాతో ముచ్చటిస్తూ వెల్లడించారు. నాయకుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని రహమాన్ ఆఫ్ ది రికార్డుగా వెల్లడించారు. ఈ మూవీ #RC16 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫ్రీ అవ్వగానే RC 16 రెగ్యులర్ షూటింగ్ జరిపే అవకాశాలు ఉన్నాయి. రెహమాన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు అనే విషయం అఫీషియల్ కావడంతో RC 16 రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయినట్టు అయింది.
Happy Birthday @arrahman sir, wish you health and happiness always. pic.twitter.com/Lj6RPkIBNs
— Ram Charan (@AlwaysRamCharan) January 6, 2024