The Kerala Story : ఓటీటిలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్ద హీరోల సినిమాలు లేదా భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న సినిమాలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటి రైట్స్ కూడా అమ్ముడు పోతుంటాయి.. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా చిన్న లేదా పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నా కూడా ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేకపోయాయి.
అలాంటి సినిమాలలో ఒక సినిమానే ది కేరళ స్టోరీ. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సుదిప్టో సేన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు.. అన్ని కలిపి ఈ సినిమాకు 28 కోట్లకుపైగా బడ్జెట్ ఖర్చయింది. మొత్తంగా సుమారుగా 35 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా భారత దేశం లో 2000 స్క్రీన్లలో రిలీజైంది. ఎన్నో వివాదాల మధ్య గతేడాది మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది..
Also Read
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ఈ సినిమా మొత్తానికి భారీగా కలెక్షన్ల ను అందుకుంది.. అయితే ఈ సినిమా విడుదలై చాలా రోజులు అయ్యింది.. ఇప్పుడు ఇన్ని రోజులకు ఓటీటీ బిజినెస్ కాకపోవడంతో నిర్మాతలు ఈ సినిమాను కనీసం యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం అని ప్లాన్స్ కూడా చేశారు. కానీ ఆఖరి నిమిషం లో జీ 5 వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. త్వరలోనే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఓటీటీ లలోకి కూడా రాబోతోందని సమాచారం.. జీ 5 వారు చిత్ర డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నట్టు తెలుస్తోంది. జనవరి 12న లేదా జనవరి 19వ తేదీన సినిమా ను జీ 5 లో విడుదల కాబోతుందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?