NTV Telugu Site icon

RC 16: చరణ్ పుట్టిన రోజున బుచ్చిబాబు సినిమా నుంచి ఊహించని అప్డేట్…

Rc 16

Rc 16

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా మెగా అభిమానులకి గిఫ్ట్ ఇస్తూ RC 16 నుంచి స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చింది. ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యు ఇచ్చిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విలేజ్ లో జరిగే ఒక చిన్న కథని పెద్దగా చెప్దాం అంటూ దర్శకుడు బుచ్చిబాబు RC 16పై అనౌన్స్మెంట్ తోనే అంచనాలని పెంచేసాడు. లేటెస్ట్ గా చరణ్ పుట్టిన రోజున ఒక ఎడిటెడ్ పోస్టర్ ని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. “తనని తాను కొత్తగా ఇన్వెంట్ చేసుకుంటున్న రామ్ చరణ్, త్వరలో బిగ్ స్క్రీన్స్ పైన రివోల్ట్ అవుతాడు” అంటూ మేకర్స్ ఈ ఎడిటెడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఊహించని అప్డేట్ బయటకి రావడంతో మెగా అభిమానులంతా #RC16 #Buchibabu #RamCharan టాగ్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. బుచ్చిబాబుతో పాటు ప్రొడ్యూసర్స్ అంతా రామ్ చరణ్ ని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. నిజానికి బుచ్చిబాబు ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాని ఎన్టీఆర్ తో చెయ్యాల్సి ఉంది. ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యడానికి బుచ్చిబాబు చాలా రోజులే వెయిట్ చేశాడు కానీ కొరటాల శివ సినిమా డిలే అవుతూనే ఉండడంతో బుచ్చిబాబు చరణ్ కి షిఫ్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ కి చెప్పిన కథనే ఇప్పుడు చరణ్ తో చేస్తున్న బుచ్చిబాబు, సెకండ్ సినిమాకే గ్లోబల్ స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేసాడు. మరి దాన్ని ఎంతవరకు నిలబెట్టుకోని, ఎలాంటి సినిమా చేస్తాడు, ఎలాంటి హిట్ ఇస్తాడు అనేది చూడాలి.

Show comments