ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ రీచ్ సాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అయిపోగానే ‘ఒక విలేజ్ కథని పాన్ ఇండియా రేంజులో చెప్దాం’ అంటూ బుచ్చిబాబు, చరణ్ ని డైరెక్ట్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు కానీ తారక్ కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ కథ చరణ్ దగ్గరకి వెళ్లింది. ముందు నుంచి ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోందని బుచ్చిబాబు చెప్తూనే ఉన్నాడు. దీంతో స్టార్ హీరోల సినిమాలపై రూమర్స్ రావడం కొత్తేం కాదు కదా. ఒక్కసారి ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చాలు.. హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? బడ్జెట్ ఎంత? స్టోరీ ఏంటి? ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తునే ఉంటాయి. ఇప్పుడు RC 16 పై కూడా అలాంటి రూమర్సే వినిపిస్తున్నాయి.
Read Also: NTR 30: కుస్తీ పోటీల్లో భైరవ vs దేవర… ఈరోజే లాస్ట్
ఈ మూవీ ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవిత కథతో బుచ్చి బాబు కథ సిద్ధం చేశారనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అంతేకాదు చరణ్ ఉత్తరాంధ్ర యాస కూడా నేర్చుకుంటున్నాడనే రూమర్ మరింత వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఈ రూమర్స్ ని మెగా పవర్ స్టార్ టీమ్ కొట్టిపారేసినట్టు తెలుస్తోంది. బయట జరుగుతున్నదంతా రూమర్స్ అని క్లియర్ కట్‌గా చెప్పేశారట. దీంతో ఆర్సీ 16 పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది, ఇది కూడా రూమరే అంటున్నారు. మరి బుచ్చిబాబు ఆర్సీ 16 క్యాస్టింగ్‌ను ఎప్పుడు ఫైనల్ చేస్తాడో చూడాలి.