Site icon NTV Telugu

శంకర్, చరణ్ పాన్ ఇండియా మూవీ లాంచ్

RC 15 movie opening ceremony

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా సినిమా ఈ రోజు ఉదయం పూజతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, రణ్వీర్ సింగ్, రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సునీల్, దిల్ రాజు, తమన్ తదితరులు హాజరయ్యారు. రామ్ చరణ్ పై తీసిన మొదటి షాట్ కు చిరంజీవి క్లాప్ కొట్టారు. దర్శక దిగ్గజం రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. “ఆర్సి 15” ప్రాజెక్ట్ లాంచ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటు “ఆర్సీ 15 లాంచ్ డే” అనే హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది.

Read Also : డ్రగ్స్ కేసులో నేడు విచారణకు హీరో రానా

ఈ రోజు ఉదయం సినిమా ముహూర్త వేడుక సందర్భంగా మేకర్స్ ప్రత్యేక ప్రకటన పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో సినిమాలోని ప్రధాన తారాగణం, సిబ్బందిని పరిచయం చేశారు. అందరూ నల్ల సూట్లు, గాగుల్స్ ధరించి ఉండడం ఆకట్టుకుంటుంది. సినిమా థీమ్, బ్యాక్‌డ్రాప్ శంకర్, రామ్ చరణ్ అభిమానులందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇక మాలీవుడ్ స్టార్ జయరామ్, స్టార్ కమెడియన్ టర్న్ హీరో సునీల్, తెలుగు నటి అంజలి, హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏస్ సినిమాటోగ్రాఫర్ తిరు, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్, టాలెంటెడ్ ప్రొడక్షన్ డిజైనర్లు రామకృష్ణ, మోనికా, ప్రముఖ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా సినిమాకు సాంకేతిక బృందం కాగా, కీసర అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Exit mobile version