Site icon NTV Telugu

MR Bachchan: వెనక్కి తగ్గిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ రిలీజ్ ఎప్పుడు అంటే..?

Rttt

Rttt

Raviteja MR Bachchan: ఈగిల్” బాక్సాఫీస్ నిరాశ తర్వాత తిరిగి బౌన్స్ అవ్వాలని చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ . పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రీమేక్ చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి..

Also Read; Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం.. దద్దరిల్లిన వేదిక

ఇక ఈ సినిమాను మొదట ఆగస్టు లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆగస్ట్ లో పుష్ప 2 ఉండటంతో మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. కానీ అదే రోజు ఎన్టీఆర్ దేవర ఉండటంతో మల్లి పోస్టుపోన్ చేస్తారు అని అనుకుంటున్నారు. ‘మిస్టర్‌ బచ్చన్‌..నామ్‌ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీపరుడైన ప్రభుత్వ అధికారిగా రవితేజ నటించారు. మిస్టర్ బచ్చన్ లక్నో, కారైకుడి మరియు హైదరాబాద్‌లో చిత్రీకరించబడింది. మిస్టర్ బచ్చన్‌కి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, కెమెరా: ఆయనంక బోస్‌,
వర్క్ చేస్తున్నారు

Exit mobile version