NTV Telugu Site icon

Raviteja73: ప్రతి ధ్వని, ప్రకంపనం అంటున్నారు.. మా రవన్నను ఏం చేస్తున్నారు బ్రో

Ravi

Ravi

Raviteja73: మాస్ మహారాజా రవితేజ.. ఏడాదిలో దాదాపు ఐదు సినిమాలు లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తాడు. ఇక ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు.. ఒకటి హిట్.. రెండోది ఫట్. ఇక ప్రస్తుతం రవితేజ సినిమాలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఇంకా షూటింగ్స్ కూడా పూర్తికాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సూర్య వర్సెస్ సూర్య సినిమాతో దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. తాజాగా Raviteja73 ను మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ పెద్ద అప్డేట్ తో పాటు ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ” ఆ లావాకి ఓ పేరుంది. ఆ పేరుకి ఓ ప్రతిద్వాని ఉంది. ఆ ప్రతిద్వాని ఓ ప్రకంపనం పుట్టిస్తుంది” అంటూ కొన్ని లైన్స్ కు వెనుక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఇచ్చి వీడియో వదిలారు. ఆ లైన్స్ వింటుంటేనే గూస్ బంప్స్ రావడం ఖాయమనిపిస్తుంది.

Allu Arjun: ఆహాను టేకోవర్ చేసిన అల్లు అర్జున్.. హోస్ట్ గా గ్రాండ్ ఎంట్రీ..?

ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ లైన్స్, బ్యాక్ గ్రౌండ్ ను బట్టి చూస్తుంటే ఇదేదో పిరియాడికల్ డ్రామాగా కనిపిస్తోంది. ఇప్పటికే రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్నాడు. ఇక దాని తరువాత కూడా ఇలాంటి సినిమా చేస్తున్నాడు అంటే నిజంగానే గట్స్ అని చెప్పాలి. ఈ అప్డేట్ చూసాక అభిమానులు ప్రతి ధ్వని, ప్రకంపనం అంటున్నారు.. మా రవన్నను ఏం చేస్తున్నారు బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా టైటిల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Show comments