NTV Telugu Site icon

Raviteja: హనుమాన్ సినిమాలో మాస్ మహారాజ్ వినిపిస్తాడు…

Raviteja

Raviteja

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. చిన్న సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తోంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ… జనవరి 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ట్రైలర్ తో ఆడియన్స్ ని సాలిడ్ గా ఇంప్రెస్ చేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో హనుమాన్ విశేషాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న మేకర్స్ లేటెస్ట్ గా ఒక సూపర్ న్యూస్ ని బయటకి వదిలారు. హనుమాన్ సినిమాలో ‘కోటి’ పాత్రకు మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ ఒక్క అనౌన్స్మెంట్ తో రవితేజ ఫ్యాన్స్ అంతా హనుమాన్ సినిమా కోసం థియేటర్స్ కి వెళ్లిపోవడం గ్యారెంటీ.

Read Also: Guntur Kaaram: ప్రతి సంక్రాంతికి అల్లుడొస్తాడు… ఈసారి మొగుడు వచ్చేలా ఉన్నాడు

రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మొదటిసారి రవితేజ జక్కన తెరకెక్కించిన మర్యాద రామయ్య సినిమాలో సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ తర్వాత నాని ప్రొడ్యూస్ చేసిన ‘ఆ!’ సినిమాలో బోన్సాయ్ మొక్కకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా శివ కార్తికేయన్ నటించిన డబ్బింగ్ సినిమా మహావీరుడు మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు హనుమాన్ సినిమాకి రవితేజ లక్కీ చార్మ్ గా కలిసాడు కాబట్టి ఈ సినిమా కూడా పాన్ ఇండియా హిట్ అవుతుందో లేదో చూడాలి.