Site icon NTV Telugu

చిత్తూరు యాసలో మాస్ మహరాజ్!

ఈ ఏడాది మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమా హిట్ తో వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. క్రాక్ తరువాత ఆయన నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. రమేశ్ వర్మ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతారని తెలుస్తోంది. కాగా రవితేజ ప్రభుత్వ అధికారి పాత్ర కనిపించనున్నాడని సమాచారం. ఆయన యాక్టింగ్ ఫుల్ కామెడీగా ఉంటుందని అంటున్నారు. ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version