NTV Telugu Site icon

Raviteja: సాగరకన్యతో టైగర్ డ్యాన్స్.. ఆ ఆటిట్యూడ్ కు ఫిదా

Raviteja

Raviteja

Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూరు సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా రేణు దేశాయ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రవితేజ.. తన అందమైన హీరోయిన్లతో కలిసి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఒక్క తెలుగునే కాకుండా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తున్నాడు. మొన్న ఆదివారం బిగ్ బాస్ తెలుగులో మెరిసిన రవితేజ .. ఇప్పుడు బాలీవుడ్ లో సందడి చేశాడు.

Anasuya: అనసూయ పొలిటికల్ ఎంట్రీ.. బీజేపీ లోకి?

సోనీలో ప్రసారమవుతున్న ఇండియా గాట్ టాలెంట్ అనే షో కు గెస్టులుగా వెళ్లారు టైగర్ టీమ్. అక్కడ బాలీవుడ్ నటులు అందరు మాస్ మహారాజా రవితేజను ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా అందాల భామ శిల్పాశెట్టి అయితే.. రవితేజతో కాలు కదిపింది. శిల్పా శెట్టి తెలుగులో సాహసవీరుడు సాగరకన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మంచి హిట్ కొట్టలేకపోవడంతో అమ్మడు బాలీవుడ్ కే పరిమితమైంది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని ఏక్ ధమ్.. ఏక్ ధమ్ సాంగ్ కు స్టెప్పులు వేసి అలరించింది. ఇక శిల్పాతో డ్యాన్స్ చేస్తూ రవితేజ చూపిన ఆటిట్యూడ్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. నోట్లో బబుల్ గమ్ నములుతూ.. ఆమెతో ఈజ్ గా స్టెప్పులు వేసి అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా తో రవితేజ పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి.