NTV Telugu Site icon

Raviteja: మిస్టర్ బచ్చన్ గా మారిపోయిన మాస్ మహారాజా…

Raviteja

Raviteja

షాక్, మిరపకాయ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన కాంబినేషన్ హరీష్ శంకర్ అండ్ రవితేజ. మాస్ మహారాజాలో ఉన్న ఎనర్జిని పర్ఫెక్ట్ గా వాడుకోవడం హరీష్ శంకర్ కి బాగా తెలుసు. అలానే హరీష్ శంకర్ వన్ లైనర్స్  రవితేజ చెప్తే సూపర్బ్ గా ఉంటుంది. యాటిట్యూడ్, మాస్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ ఆ రేంజులో ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడంతో హరీష్ శంకర్, మాస్ మహారాజాతో ప్రాజెక్ట్ సెట్ చేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో రవితేజ హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. హిందీ రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి “మిస్టర్ బచ్చన్…” అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

“నామ్ తో సునాహోగా” అనే ట్యాగ్ లైన్ కి కూడా పెట్టాడు హరీష్ శంకర్. రవితేజ అమితాబ్ బచ్చన్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది తెలిసిన విషయమే. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో రవితేజ సినిమా చేస్తుండడం అభిమానులని ఎంటర్టైన్ చేస్తోంది. ఈరోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. స్కూటీపైన సీరియస్ గా కూర్చొని ఉన్న రవితేజ మిస్టర్ బచ్చన్ పోస్టర్ లో అగ్రెసివ్ గా ఉన్నాడు. రైడ్ సినిమా ఒరిజినల్ కథతో తెరకెక్కింది, కాస్త సీరియస్ టోన్ లో సాగే ఈ సినిమాకి హరీష్ శంకర్ తన మార్క్ టచ్ ఎలా ఇస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ విషయం. మరి ఈ కాంబో హ్యాట్రిక్ సినిమాతో ఎలాంటి హిట్ కొడుతుంది అనేది చూడాలి.