యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సోషల్ మీడియా వేదికగా కొంతమంది రవితేజ అభిమానులు ‘ఖిలాడీ’ కిక్ మాకు కూడా కావాలంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రవితేజ వెస్ట్ బెంగాల్ లో కూడా పాపులర్. ఇక్కడ కూడా ‘ఖిలాడీ’ సినిమాను రిలీజ్ చేయండి. లేదా కనీసం కోల్కత్తాలో అయినా విడుదల చేయండి అంటూ మేకర్స్ ను అభ్యర్థించారు. ఆ స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన మాస్ మహారాజ అభిమాని ఈ రకమైన కామెంట్స్ మరింత ఎనర్జీని ఇస్తాయంటూ కామెంట్ చేశాడు. దీంతో రవితేజ అభిమానులు తమ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి మురిసిపోతున్నారు.
Read Also : FIR బ్యాన్… విష్ణు విశాల్ కు షాక్
ఇక ‘ఖిలాడీ’లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఏ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు.
