Site icon NTV Telugu

Raviteja: డైనోసర్ తో రానున్న ఈగల్…

Raviteja Eagle

Raviteja Eagle

డిసెంబర్ 22న పాన్ ఇండియా పండక్కి రెడీ అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తో కలిసి తనకి టైలర్ మేడ్  లాంటి మాస్ రోల్ లో నటిస్తూ సలార్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు ప్రభాస్. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 9 రోజులు ఉండగానే సోషల్ మీడియాలో సలార్ సందడి మొదలైపోయింది. కొన్ని ఏరియాల్లో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సలార్ రిలీజ్ అవుతున్న డిసెంబర్ 22న ఇండియా మొత్తం పండగ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఈ డేట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కూడా సిద్ధమవుతున్నారని టాక్. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఈగల్ సినిమా జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ ట్రైలర్ కోసం రవితేజ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

రవితేజ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఈగల్ ట్రైలర్ రెండు మూడు రోజుల్లో బయటకి వచ్చే అవకాశం ఉంది. ట్రైలర్ రిలీజ్ తో ఈగల్ ప్రమోషన్స్ లో జోష్ పెరగనుంది. ఈ ట్రైలర్ ని సలార్ రిలీజ్ అయ్యే థియేటర్స్ లో ప్లే చేయడానికి ఈగల్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఇదే బ్యానర్ లో ప్రభాస్ మారుతీతి సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ భారీగా రిలీజ్ అయ్యే ప్రభాస్ సినిమాతో పాటు ఈగల్ ట్రైలర్ ని అటాచ్ చెయ్యడం అనేది మంచి స్ట్రాటజీ. ఈ కారణంగా ఈగల్ మూవీ రీచ్ మరింత పెరగనుంది.

Exit mobile version