మరో వారం రోజుల్లో మాస్ మహారాజా నటిస్తున్న ఈగల్ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. పలు ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. ప్రచార సెగ అంటూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. అయినా కూడా ఈగల్‌కు ఈ సౌండ్ సరిపోయేలా లేదు. మేకర్స్ ఈగల్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచాల్సి ఉంది. సాలిడ్ బజ్ జనరేట్ అయ్యేలా చేయాలి. మిగతా సినిమాల మేలు కోరి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న మాస్ రాజా.. ఈగల్ సినిమాను ఫిబ్రవరి 9న థియేటర్లోకి తీసుకురాబోతున్నాడు. వచ్చే వారమే బాక్సాఫీస్ పై ఈగల్ ఎటాక్ జరగనుంది. కానీ సినిమా పై అనుకున్నంత బజ్ రావడం లేదు.
Read Also: Shivanna: రూట్ మార్చి ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న శివన్న…
అలా జరగాలంటే ఈగల్ మేకర్స్ అదిరిపోయే రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయాల్సిందే. సినిమా రిలీజ్‌కు వారం రోజులు కూడా లేదు కాబట్టి.. ఈ మధ్యలోనే గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఈగల్ ఈవెంట్ గురించి ఎలాంటి అప్టేట్ లేదు. ఈవెంట్ ఉంటుందా? ఉండదా? అనేది పక్కన పెడితే.. సినిమా రిలీజ్ అయ్యేలోపు రిలీజ్ ట్రైలర్ ఏమైనా ఉంటుందా? అని మాస్ రాజా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈగల్ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్.. ఈగల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ అని అంచనాలు పెంచేశాయి. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈగల్‌తో మాస్ రాజా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
Read Also: Vijay Deverakonda: రేషన్ షాప్ కి ఆధార్ ఎందుకు? ట్రోలింగ్ చేయడమే టార్గెట్