Site icon NTV Telugu

Khiladi : ఓటిటి రిలీజ్ కు రెడీ

khiladi

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఖిలాడీ’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రవితేజ ఇద్దరు అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేశాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, డిఎస్పీ సంగీతం అందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. “ఖిలాడి” ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం సరిగ్గా ఒక నెల తర్వాత ఈ మూవీ ఓటిటీ ప్రీమియర్‌లకు సిద్ధంగా ఉంది.

Read Also : Shane Warne Demise : క్రికెట్ లెజెండ్ కు సెలెబ్రిటీల నివాళి

మార్చి 11వ తేదీ నుండి ఖిలాడీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుంది. “ఈ ఆటలో ఒక్కడే కింగ్… మరికొద్ది రోజులే వెయిటింగ్… ఫుల్ కిక్ తో మార్చ్ 11న డిస్నీ హాట్ స్టార్ లో మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడీ’ రాబోతున్నాడు” అంటూ హాట్ స్టార్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మరి బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను నిరాశకు గురి చేసిన ‘ఖిలాడీ’కి ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Exit mobile version