Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్

Raviteja

Raviteja

మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తూన్నారు. వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీనితో పాటు యంగ్ హీరో శ్రీ విష్ణుతో కలిసి హసిత్ గోలి దర్శకత్వంలో వీరధీ వీరులు అనే మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

ఇక టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ క్రేజీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ మార్క్ యూనిక్ మేకింగ్, రవితేజ ఎనర్జీ కలిస్తే థియేటర్లలో ఏ స్థాయిలో రచ్చ ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది . ఈ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన హీరోయిన్‌గా గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలసి ఖిలాడి, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలలో కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. కానీ రవితేజ అభిమానులు మాత్రం డింపుల్ వద్దని కోరుతున్నారు. ఈ హీరోయిన్ ఎంపికపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ప్రస్తుతం నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.