Raviteja: కాళికాదేవి ఎపిసోడ్ అయితే నన్ను నేను నమ్మలేకపోయాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raviteja: మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల పేక్షకులని అలరించి పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఇక ఈ సక్సెస్ మీట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ గెస్ట్ గా విచ్చేశాడు.
ఇక ఈ సక్సెస్ మీట్ లో రవితేజ మాట్లాడుతూ.. ” ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు చాలా ఆనందంగా వుంది. నా పాత్ర మేకోవర్ కి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్ కి చాలా ఎక్సయిట్ అయ్యాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్ తో వచ్చే మిస్టర్ బచ్చన్ తో హ్యాట్రిక్ కొడుతున్నాం. డేవ్ జాండ్ సౌండ్ ఇరగదీశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. అలాగే మణి చాలా పవర్ ఫుల్ మాటలు రాశాడు. తన పద ప్రయోగం చాలా బావుంది. కావ్య థాపర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. తనకి బ్రైట్ ఫ్యూచర్ వుంటుంది. కాళికాదేవి ఎపిసోడ్ అయితే నన్ను నేను నమ్మలేకపోయాను. ఎవరినో చూస్తున్న అనుభూతి కలిగింది. చాలా అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ అద్భుతమైన విజన్ కలిగిన దర్శకుడు. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశాడు. తను టాప్ డైరెక్టర్ అవుతాడు. అనుపమ, అజయ్ ఘోస్, వినయ్ రాయ్ అందరూ తమ పాత్రలని పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!