Ravi Teja: మరో కొత్త సినిమాకి సంతకం.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja Signed New Projected Under Karthik Ghattamaneni Direction: జయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆల్రెడీ ఇతని చేతిలో ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల చిత్రీకరణల్లో రవితేజ ఒకేసారి పాల్గొంటున్నాడు. ఈ ఏడాది చివరిలోపే ఆ సినిమాల షూటింగ్స్ ముగియనున్నట్టు తెలుస్తోంది. అందుకేనేమో.. ఆ తర్వాత ఖాళీగా ఉండకూడదని రవితేజ మరిన్ని సినిమాల్ని లైన్‌లో పెడుతున్నాడు. తన వద్దకు వస్తోన్న ప్రతీ కథను వింటోన్న ఈ మాస్ మహారాజా.. లేటెస్ట్‌గా ఓ కొత్త ప్రాజెక్ట్‌కి సంతకం చేశాడని సమాచారం.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఆల్రెడీ ఫైనల్ స్క్రిప్ట్‌ని లాక్ చేసినట్టు తెలిసింది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా అవతారమెత్తిన కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి ‘ఈగల్’ అనే టైటిల్ ఖరారు చేశారని.. విదేశాల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరణ నిర్వహించనున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన లొకేషన్స్‌ని కూడా ఫైనల్ చేశారట! ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల షూటింగుల్ని ముగించుకున్నాక.. రవితేజ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నాడు. రవితేజ దూకుడు, చిత్రబృందం జోరుని చూస్తుంటే.. అత్యంత వేగంగా షూటింగ్ ముగించుకొని.. వచ్చే ఏడాది సమ్మర్‌కే సినిమాని విడుదల చేయనున్నట్టు కనిపిస్తోంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
అన్నట్టు.. ఇంకో విషయం! శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఓ కామిక్ ఎంటర్టైనర్ చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో వింటేజ్ రవితేజను చూస్తారని దర్శకుడు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు కూడా! త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం హీరో గోపీచంద్‌తో చేస్తున్న సినిమా ముగియగానే.. డైరెక్టర్ శ్రీవాస్ ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థే నిర్మించనుంది. అటు.. బాబీ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రూపొందుతోన్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలోనూ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే!
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!