NTV Telugu Site icon

Ravi Teja: మరో కొత్త సినిమాకి సంతకం.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Ravi Teja Eagle Movie

Ravi Teja Eagle Movie

Ravi Teja Signed New Projected Under Karthik Ghattamaneni Direction: జయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆల్రెడీ ఇతని చేతిలో ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల చిత్రీకరణల్లో రవితేజ ఒకేసారి పాల్గొంటున్నాడు. ఈ ఏడాది చివరిలోపే ఆ సినిమాల షూటింగ్స్ ముగియనున్నట్టు తెలుస్తోంది. అందుకేనేమో.. ఆ తర్వాత ఖాళీగా ఉండకూడదని రవితేజ మరిన్ని సినిమాల్ని లైన్‌లో పెడుతున్నాడు. తన వద్దకు వస్తోన్న ప్రతీ కథను వింటోన్న ఈ మాస్ మహారాజా.. లేటెస్ట్‌గా ఓ కొత్త ప్రాజెక్ట్‌కి సంతకం చేశాడని సమాచారం.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఆల్రెడీ ఫైనల్ స్క్రిప్ట్‌ని లాక్ చేసినట్టు తెలిసింది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా అవతారమెత్తిన కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి ‘ఈగల్’ అనే టైటిల్ ఖరారు చేశారని.. విదేశాల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరణ నిర్వహించనున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన లొకేషన్స్‌ని కూడా ఫైనల్ చేశారట! ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల షూటింగుల్ని ముగించుకున్నాక.. రవితేజ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నాడు. రవితేజ దూకుడు, చిత్రబృందం జోరుని చూస్తుంటే.. అత్యంత వేగంగా షూటింగ్ ముగించుకొని.. వచ్చే ఏడాది సమ్మర్‌కే సినిమాని విడుదల చేయనున్నట్టు కనిపిస్తోంది.

అన్నట్టు.. ఇంకో విషయం! శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఓ కామిక్ ఎంటర్టైనర్ చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో వింటేజ్ రవితేజను చూస్తారని దర్శకుడు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు కూడా! త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం హీరో గోపీచంద్‌తో చేస్తున్న సినిమా ముగియగానే.. డైరెక్టర్ శ్రీవాస్ ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థే నిర్మించనుంది. అటు.. బాబీ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రూపొందుతోన్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలోనూ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే!

Show comments