Site icon NTV Telugu

Raviteja : రేపే రవితేజ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్

Ravi

Ravi

Raviteja : మాస్ మహారాజ రవితేజ అభిమానులకు సూపర్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కిషోర్ తిరుమల, ఇక నిర్మాతగా చెరుకు సుధాకర్ వ్యవహరిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. “టైటిల్ & ఫస్ట్ లుక్ రివీల్ రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు” అంటూ తెలిపారు. దీంతో రవితేజ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్‌మెంట్ నెలకొంది.

Read Also : Ariyana : మూడేళ్లు అతనితో ఒకే రూమ్ లో ఉన్నా.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్

ఈ కాంబినేషన్‌ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి హైప్ ఉంటుంది. కిషోర్ తిరుమల స్టైల్లో ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ అయితే ఇటీవల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన కొత్త సినిమా నుంచి ఈ అప్‌డేట్ రావడంతో సోషల్ మీడియాలో #RaviTejaNewMovie అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.మొత్తానికి, రేపు మధ్యాహ్నం 3.33కి రవితేజ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కాబోతుండటంతో మాస్ ఫ్యాన్స్ భారీగా రెడీ అవుతున్నారు.

Read Also : Samantha – Rashmika : ఫ్యాన్స్ తో ఆటలాడుతున్న రష్మిక, సమంత.. ఎందుకిలా..?

Exit mobile version