NTV Telugu Site icon

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ రొమాంటిక్ మూడులో జిక్కీ సాంగేసుకుంటే?

Mr Bachan

Mr Bachan

Mr Bachchan Third Single Release: మాస్ మహారాజ్ ర‌వితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బ‌చ్చ‌న్’. బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు ఇప్ప‌టికే మంచి బ‌జ్ ను క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు రిలీజ్ చేసిన రెండు పాట‌లు ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేశాయి. అయితే, తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్ గా ‘జిక్కీ’ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. రొమాంటిక్ మెలోడీ సాంగ్ గా వ‌స్తున్న ఈ సాంగ్ కు వ‌న‌మాలి లిరిక్స్ అందించారు. ఇక ఈ పాట‌ను కార్తీక్, ర‌మ్య బెహ‌రా ఆల‌పించారు. ఇక ఈ పాట‌లో భాగ్యశ్రీ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Also Read: Tharun Bhascker: తరుణ్ భాస్కర్ సినిమాలో నటించాలని ఉందా?

మూవీలో రవితేజ, భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీ వేరేలేవేల్ అనే చెప్పుకోవాలి. ఈ పాటలో విజువల్స్‌ స్టన్నింగ్ గా వున్నాయి. అద్భుతంగా వేసిన సెట్‌లు, రియల్ కాశ్మీర్ లోకేషన్స్ కట్టిపడేశాయి. కాశ్మీర్ సీనిక్ బ్యూటీ గ్రేట్ అంథంటసిటీ యాడ్ చేసింది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ రొమాంటిక్ మెలోడీ నిజంగా మిమ్మల్ని మ్యూజికల్ పారడైజ్ లోకి తీసుకువెళుతుంది అనడంలో సందేహం లేనేలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో ఈ సినిమాని నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు .బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ టాప్ క్లాస్ లో వుండబోతోంది. ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌ గ వర్క్ చేస్తున్నారు. మరి ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చుడాలిసిందే..

Show comments