Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!

Irumudi 4 300kb

Irumudi 4 300kb

Irumudi OTT: మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ (Irumudi) థియేటర్లలో భారీ విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా నెం.1 స్థానంలో దూసుకుపోతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద నెల రోజుల థియేట్రికల్ రన్ ముగించుకునే సరికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ₹238.65 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాగా, విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఇండియా వైడ్‌గా టాప్-1 ట్రెండింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్‌తో పాటు రిపీట్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్‌కు ఓటీటీలో బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ మూవీ కేవలం భారతదేశంలోనే కాకుండా మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాలలో కూడా నాన్-ఇంగ్లీష్ మూవీ కేటగిరీలో టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది. ఇటీవల ఈ మూవీ 99వ ఆస్కార్ అవార్డుల (2027) కోసం భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ రేసులో నిలిచిన 4 తెలుగు సినిమాలలో ఒకటిగా నిలవడం కూడా దీని వ్యూవ్‌షిప్ విపరీతంగా పెరగడానికి ఒక ప్రధాన కారణమైంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సబ్‌టైటిల్స్, డబ్బింగ్ వెర్షన్లతో అందుబాటులోకి తీసుకురావడంతో అన్ని భాషల ప్రేక్షకులు దీనిని వీక్షిస్తున్నారు. రవితేజ పవర్‌ఫుల్ యాక్టింగ్, కనులు చెమర్చే తండ్రి- కూతుర్ల సెంటిమెంట్ సీన్స్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఓటీటీ డిజిటల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సైతం దూసుకుపోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రవితేజ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. మైత్రి మూవీ మేకర్స్‌కు చెందిన సినిమాలు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ చార్టులో టాప్ రెండు స్థానాలను ఆక్రమించాయి. ‘ఇరుముడి’ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ‘మోద రాత్రి’ రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల్లో మైత్రి మూవీ మేకర్స్ కంటెంట్‌కు ఉన్న ఆదరణ మరోసారి చర్చకు వచ్చింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఓటీటీలోకి వచ్చిన సినిమాకు అక్కడ కూడా మంచి స్పందన రావడం మేకర్స్‌కు మరో పాజిటివ్ సంకేతంగా మారింది. ఇక పూర్తి ఓపెనింగ్ వీక్ వ్యూయర్‌షిప్ గణాంకాలు వెల్లడైన తర్వాత ఈ సినిమా డిజిటల్ విజయంపై మరింత స్పష్టమైన అంచనా రానుంది.