Irumudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumbudi Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినాను చూపిస్తోంది. చాలా సంవత్సరాలుగా దోబూచులాడిన బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో అందుకున్నారు రవితేజ. వీకెండ్ ఓపెనింగ్ లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తూ 100కోట్ల మార్కును అవలీలగా దాటేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ తెలుగు రాష్ట్రాల్లో రవితేజ కెరీర్లోనే కాకుండా రీజినల్ సినిమాల బాక్సాఫీస్ పరంగా కూడా ప్రత్యేకమైన రన్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డే 4 కలెక్షన్ల విషయంలో ఈ భారీ రికార్డును నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో ‘బాహుబలి 2’ మాత్రమే ‘ఇరుముడి’ కంటే ముందుండటం విశేషంగా మారింది. దీంతో నాలుగో రోజు కూడా సినిమా ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ మూవీ నాలుగు రోజుల్లోనే వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. వీకెండ్ ఓపెనింగ్ తర్వాత కలెక్షన్లు నిలకడగా కొనసాగడం వల్లే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కారణంగా వీక్డేస్లోనూ థియేటర్లలో ఆక్యుపెన్సీ బలంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ బుకింగ్స్‌ను పరిశీలిస్తే సినిమాపై ఉన్న క్రేజ్ మరింత స్పష్టమవుతోంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటికే 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. కేవలం మొదటి రెండు మూడు రోజులకు మాత్రమే పరిమితమైన హైప్ కాకుండా, సినిమా రన్ కొనసాగుతున్న కొద్దీ టికెట్ డిమాండ్ కూడా నిలకడగా ఉండటం ఇప్పుడు చిత్ర బృందానికి పెద్ద ప్లస్‌గా మారింది. కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల డిమాండ్‌కు అనుగుణంగా థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
- Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. 'రామాయణ' మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
మరోవైపు డే 5 అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పాజిటివ్‌గా ఉండటం ‘ఇరుముడి’కు మరో ప్లస్ గా మారింది. సాధారణంగా సోమవారం తర్వాత సినిమాల కలెక్షన్లలో స్పష్టమైన డ్రాప్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నాలుగో రోజు కూడా భారీ స్థాయి వసూళ్లు రావడం, ఐదో రోజుకు ముందస్తు బుకింగ్స్ బలంగా ఉండటం సినిమా బాక్సాఫీస్ రన్‌పై ఆశలు పెంచుతోంది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ‘ఇరుముడి’ మరిన్ని బాక్సాఫీస్ మైలురాళ్లను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి నాలుగు రోజుల్లోనే ప్రవేశిస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఫుల్ రన్లో ఎక్కడి వరకు వెళ్తుంది, రవితేజ కెరీర్లో ఎలాంటి కొత్త రికార్డులను నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ‘ఇరుముడి’ విజయోత్సాహం రవితేజ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ జోరుగా కొనసాగుతోంది. అయితే ‘టాక్సిక్’ ప్రభావం ఈ సినిమాపై పడుతుందనే చర్చ కూడా మొదలవుతోంది. మరి రేపు రిలీజ్ కానున్న ‘టాక్సిక్’ ను తట్టుకుని ఈమూవీ ఇదే తరహా కలెక్షన్స్ కొనసాగిస్తే 200 కోట్ల మార్క్ ను దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
-
BJP vs Congress: సిక్కు వ్యతిరేక అల్లర్ల రోజే ర్యాలీ ఎందుకు.? రాహుల్‌ను ప్రశ్నించిన జేపీ నడ్డా!
-
Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..
-
Delhi: ఓపెన్ టాప్ జీపులో రాహుల్ గాంధీ.. మమత, అఖిలేష్ సహా విపక్ష నేతలతో ర్యాలీ!
-
IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!