NTV Telugu Site icon

Raviteja: కోర్ట్ బోను ఎక్కిన రవితేజ.. ఏం తప్పు చేశాడు..?

Raviteja

Raviteja

Raviteja: ప్రస్తుతం సినిమా ఎవరైనా తీస్తున్నారు.. కానీ, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం మాత్రం కొందరే చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రమోషన్స్ ముఖ్యం బిగిలూ అన్నమాట. ఏదైనా చేయండి.. కానీ, సినిమా ఏమాత్రం ప్రేక్షకుల మనస్సులో నాటుకుపోవాలి. ఈ విషయం తెల్సినవారు సినిమాలను తీయదేం కాదు ప్రమోషన్స్ తో కూడా అదరగొడుతున్నారు. ఎంత డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తే అంత పేరు వస్తుంది. అదే మాటను నమ్మినట్టు ఉన్నాడు.. మాస్ మహారాజా రవితేజ.. ఆయన కూడా డిఫరెంట్ గా తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రావణాసుర. ఈ చిత్రంలో రవితేజ సరసన మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Tapsee: బ్రా లేకుండా దాంతో కవర్ చేసినా.. కనిపించేస్తున్నాయే

ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. రవితేజ, సుధీర్ వర్మ, హీరోయిన్లు.. వరుస ఇంటర్వ్యూలతో సినిమా విషయాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే నాని, రవితేజ ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. తాజాగా సుమతో రావణాసుర టీమ్ ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇక సుమ ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రావణాసుర ఒక కోర్టు డ్రామా అని టాక్. అందుకే ఇంటర్వ్యూ సెట్ లో కోర్టు బోనులు వేయించి అందులో తప్పుచేసినవారిగా ఒక పక్క రవితేజను.. ఇంకోపక్క సుధీర్ వర్మను నిలబెట్టి సుమ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Show comments