Site icon NTV Telugu

Ravi Teja : రవితేజ బయోపిక్ ప్లాన్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Raviteja Sidhu

Raviteja Sidhu

ఇండస్ట్రీ ఎవ్వరి కెరీర్‌ను ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతుందో తెలియదు. ఒకరు ఎంత ట్రై చేసి, ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న లక్ మాత్రం కలిసిరాదు. కానీ కొంత మంది నటీనటులు చిన్న చిన్న పాత్రలో కనిపించి అంచెలంచెలుగా ఎదిగి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటు.. స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. సైడ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ ‌తో అలరించిన ఆయన హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అతని కెరీర్ ఓ గాడిలో పడింది మాత్రం.. ‘డీజే టిల్లు’. ఈ మూవీలో తన అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం.. సిద్ధు నటిస్తున్న “తెలుసు కదా” సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. ఆ సందర్భంలో..

సిద్ధు జొన్నలగడ్డ, మాస్ మహారాజ రవితేజతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య జరిగిన చిట్‌చాట్ ఆసక్తికరంగా మారింది. సినిమాల గురించి మొదలైన ఈ సంభాషణలో, బయోపిక్స్ పై చర్చ వచ్చింది. ఈ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ ఒక సర్ప్రైజ్ విషయాన్ని వెల్లడించాడు. తన “కృష్ణ అండ్ హిస్ లీలా” సినిమా రిలీజ్ అయిన తర్వాత, తాను రవితేజ జీవితంపై ఓ బయోపిక్ చేయాలని అనుకున్నానని తెలిపారు. అంతేకాక, దానికి సంబంధించిన కాన్సెప్ట్ పై దాదాపు రెండు నెలల పాటు పని చేశానని కూడా చెప్పాడు. ఈ వ్యాఖ్యలు విన్న రవితేజ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.. దీనికి స్పందించిన రవితేజ, తానూ ఒక నటుడి బయోపిక్ చేయాలనుకుంటున్నానని, కానీ దాని గురించి ఇప్పుడు వివరాలు చెప్పలేదని అన్నారు. ఇద్దరు హీరోలు ఇలా బయోపిక్‌లపై మాట్లాడటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మరి రవితేజపై సిద్ధు చేసిన ఆ ప్లాన్ ఎప్పుడైనా రియాలిటీ అవుతుందా? అన్నది చూడాలి.

Exit mobile version