Ravi Teja : రవితేజ బయోపిక్ ప్లాన్ చేసిన హీరో ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీ ఎవ్వరి కెరీర్‌ను ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతుందో తెలియదు. ఒకరు ఎంత ట్రై చేసి, ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న లక్ మాత్రం కలిసిరాదు. కానీ కొంత మంది నటీనటులు చిన్న చిన్న పాత్రలో కనిపించి అంచెలంచెలుగా ఎదిగి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటు.. స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. సైడ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ తో అలరించిన ఆయన హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అతని కెరీర్ ఓ గాడిలో పడింది మాత్రం.. ‘డీజే టిల్లు’. ఈ మూవీలో తన అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం.. సిద్ధు నటిస్తున్న “తెలుసు కదా” సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. ఆ సందర్భంలో..
సిద్ధు జొన్నలగడ్డ, మాస్ మహారాజ రవితేజతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య జరిగిన చిట్‌చాట్ ఆసక్తికరంగా మారింది. సినిమాల గురించి మొదలైన ఈ సంభాషణలో, బయోపిక్స్ పై చర్చ వచ్చింది. ఈ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ ఒక సర్ప్రైజ్ విషయాన్ని వెల్లడించాడు. తన “కృష్ణ అండ్ హిస్ లీలా” సినిమా రిలీజ్ అయిన తర్వాత, తాను రవితేజ జీవితంపై ఓ బయోపిక్ చేయాలని అనుకున్నానని తెలిపారు. అంతేకాక, దానికి సంబంధించిన కాన్సెప్ట్ పై దాదాపు రెండు నెలల పాటు పని చేశానని కూడా చెప్పాడు. ఈ వ్యాఖ్యలు విన్న రవితేజ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.. దీనికి స్పందించిన రవితేజ, తానూ ఒక నటుడి బయోపిక్ చేయాలనుకుంటున్నానని, కానీ దాని గురించి ఇప్పుడు వివరాలు చెప్పలేదని అన్నారు. ఇద్దరు హీరోలు ఇలా బయోపిక్‌లపై మాట్లాడటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మరి రవితేజపై సిద్ధు చేసిన ఆ ప్లాన్ ఎప్పుడైనా రియాలిటీ అవుతుందా? అన్నది చూడాలి.
Also Read
- M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా 'MS సుబ్బులక్ష్మి' బయోపిక్ ప్రారంభం
- OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
- Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
- RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!