Site icon NTV Telugu

Ravi Kishan: ఆమె నన్ను రాత్రికి రమ్మంది.. అల్లు అర్జున్ విలన్ షాకింగ్ కామెంట్స్

Ravikishan

Ravikishan

Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. రవికిషన్ ను మాత్రం రేసుగుర్రం విలన్ గానే గుర్తుపడతారు. ఇక ఈయన నటుడే కాదు.. ఎంపీ కూడా. రవికిషన్ ముక్కుసూటి మనిషి. ప్రజలకు హెల్ప్ చేయాలన్నా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నా.. ఎవరికి భయపడకుండా ముక్కుసూటిగా చేసేస్తారు. ఇక ఆయన సినీ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. వాటిలో క్యాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. ఇండస్ట్రీలో హీరోయిన్లకు మాత్రమే లైంగిక వేధింపులు జరుగుతాయి అనుకోవడం పొరపాటు. చాలామంది అబ్బాయిలు కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాధితులే. అయితే ఈ విషయాలు చాలా రేర్ గా బయటికి వస్తాయి. తాజాగా రవికిషన్ ఈ విషయాన్నీ బయటపెట్టాడు.

BoyapatiRAPO: బోయపాటి మామ.. రామ్ ను ఈ రేంజ్ లో చూపిస్తావనుకోలేదే

ఒక ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నేను దాన్ని నుంచి తప్పించికొని బయటపడ్డాను. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కద్దు అని ముందుగానే డిసైడ్ అయ్యాను. నాకు ట్యాలెంట్ ఉంది. ఏదో ఒకరోజు నేను పైకి వస్తాను అని నమ్మాను. అందుకే షార్ట్ కట్ లను నమ్ముకోలేదు. నేను కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ఇండస్ట్రీలో ఉన్న ఒక మహిళ.. నాదగ్గరకు వచ్చి.. రాత్రికి కాఫీకి రమ్మని పిలిచింది. ఉదయం, మధ్యాహ్నం కాకుండా రాత్రికి కాఫీకి పిలవడమేంటి అని అనుకున్నాను. ఆ తరువాత ఆమె ఎందుకు పిలిచిందో అర్ధమయ్యింది. వెంటనే నేను నో చెప్పాను. ఆమె ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉంది. ఆమె పేరు చెప్పలేను.. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తానికి ఆమె ఎవరో తెలుసు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవికిషన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version