NTV Telugu Site icon

Ravi Kishan: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కుమార్తె.. ఫిదా అవుతున్న నెటిజన్స్

Ravi

Ravi

Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో రేసుగుర్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్ కు ధీటైన విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటించిన రవికిషన్ ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇక తాజాగా రవికిషన్ కుమార్తె గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఆర్మీలో చేరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పథకంలో భాగంగా ఆమె ఆర్మీలో చేరింది. ఇక నేటితో ఆమె ఆర్మీ ట్రైనింగ్ ను పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రవికిషన్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలిపాడు.

Spy: స్పై మూవీలో బాలయ్య.. మాములుగా ఉండదు మరి

ప్రస్తుతం ఇషితా వయస్సు 21. అతి చిన్న వయస్సులోనే ఆమె దేశాన్ని కాపాడే సైనికురాలిగా మారడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు.. అయినా హీరోయిన్ గానో, మరే రంగాన్నో ఎంచుకోకుండా ఎంతో పట్టుదలతో ఆర్మీ సైనికురాలుగా మారిన ఇషితాను అభిమానులు ప్రశంసిస్తున్నారు. తండ్రికె కాకుండా దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చావని ప్రశంసిస్తున్నారు. ఇషితా ఎంతోమంది యువతులకు ఆదర్శమని.. ఆమెను అలా పెంచినందుకు రవికిషన్ సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Show comments