Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ – మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం డ్రాగన్. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 సందర్భంగా విడుదల కానున్న ప్రత్యేక గ్లింప్స్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాకు ప్రాణం పోసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం సంగీత దర్శకుడు రవి బస్రూర్ గత మూడు రోజులుగా నిర్విరామంగా పని చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లకు రవి బస్రూర్ ఇచ్చే మ్యూజిక్ ఎలాంటి ఎలివేషన్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘డ్రాగన్’ గ్లింప్స్ కోసం రవి బస్రూర్ ఒక పవర్‌ఫుల్ అండ్ యూనిక్ స్కోర్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ గ్లింప్స్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో వచ్చిన ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాల టీజర్లు మరియు గ్లింప్స్ వీడియోలను మించేలా ‘డ్రాగన్’ గ్లింప్స్ ఉండాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని విజువల్స్ మరియు సౌండ్ పరంగా ఒక కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ప్రశాంత్ నీల్ టీమ్ కష్టపడుతోంది. ఈ గ్లింప్స్‌తో సినిమా కథాంశంపై ఒక చిన్న క్లూ ఇవ్వడంతో పాటు ఎన్టీఆర్ లుక్‌ను చాలా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మే 20న రానున్న ఈ ‘డ్రాగన్’ గ్లింప్స్ కోసం నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ మొదలుపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి.
Also Read
- Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
- Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
- Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
తాజావార్తలు
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..