NTV Telugu Site icon

Raveena Tandon: ఆ టార్చర్ హీరోయిన్లకేనా.. హీరోలకు లేదెందుకు?

Raveena Tandon

Raveena Tandon

Raveena Tandon On Second Innings Tag For Heroines: వయసు మీద పడుతున్నా, ముసలి వారు అవుతున్నా.. కొందరు హీరోలకు ‘హీరో’ అనే ట్యాగ్ ఉంటుంది. ఉదాహరణకు రజినీకాంత్, సల్మాన్ కాన్, కమల్ హాసన్‌లనే తీసుకోండి. వీరితోపాటు ఇంకా చాలామంది ఆరు పదుల వయసు దాటిన వారున్నారు. వాళ్లు ఇంకా హీరోలుగానే కొనసాగుతున్నారు. కానీ.. హీరోయిన్ల విషయంలో మాత్రం అలా ఉండదు. కొంత గ్యాప్ తీసుకున్నా, పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి రీఎంట్రీ ఇచ్చినా.. వాళ్లకు ‘హీరోయిన్’ అనే ట్యాగ్ దాదాపు తొలగిపోతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే వస్తాయి. దీంతో.. వారికి సెకండ్ ఇన్నింగ్స్ అనే ముద్ర పడుతుంది. ఇదే తమను టార్చర్‌కి గురి చేస్తుందని సీనియర్ నటి రవీనా టండన్ తన ఆవేదనని వ్యక్తం చేసింది.

ఓ మీడియాతో రవీనా మాట్లాడుతూ.. ‘‘హీరోలు ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్లు గ్యాప్ తీసుకుంటారు. కానీ, హీరోయిన్లు కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటే చాలు, సెకండ్ ఇన్నింగ్స్ అనే ముద్ర వేస్తారు. ఎందుకని? మాధురీ దీక్షిత్ 90ల కాలంలో సూపర్ స్టార్ అని మీడియాలో కథనాలు వేస్తుంటారు. మరి.. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లు కూడా ఆ కాలం నాటికి చెందిన వారేగా? వారిని ఎందుకు అలా అనరు? ఇప్పటికీ వాళ్లను హీరోలుగానే పరిగణిస్తుంటారు. హీరో, హీరోయిన్ల విషయంలో చూపిస్తున్న ఈ అసమానతను అంతం చేయాలి’’ అంటూ వాపోయింది. ‘కేజీఎఫ్-2’లో కీలక పాత్ర పోషించి తన సత్తా చాటిన తన మేటర్‌లో కూడా ‘సెకండ్ ఇన్నింగ్స్’ అని ప్రస్తావిస్తుండటం వల్లే.. రవీనా ఇలా ఆగ్రహంతో ఊగిపోయింది. మరి, దీనిపై హీరోలు ఎలా స్పందిస్తారో?

Show comments